* డీఎస్ క్రమశిక్షణ గల వ్యక్తి
* పార్థీవ దేహానికి నివాళి అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పీసీసీ అధ్యక్షుడు (PCC President) గా 2004లో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి రావడానికి డీఎస్(DS) ఎంతో కృషి చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గుర్తు చేశారు. తాను చనిపోతే కాంగ్రెస్ కండువా కప్పాలని ఆయన కోరారని అన్నారు. నిజామాబాద్ జిల్లా (Nizamabad District) కేంద్రంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు (Former PCC President) ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) భౌతికయానికి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత డీఎస్ కుమారులు సంజయ్(Sanjay), అరవింద్ (Arvind) తో మాట్లాడి సీఎం ఓదార్చారు. కాంగ్రెస్ పార్టీకి శ్రీనివాస్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన జ్ఞాపకార్థం ఏం చేయాలో కుటుంబసభ్యులతో మాట్లాడి చేస్తామన్నారు. సోనియా, రాహల్ తరఫున కూడా సానుభూతి తెలిపారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఆయన వెంట ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, మాజీ మంత్రి మండల వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.
——————————