
* నీటి పారుదల శాఖ పారదర్శకంగా ఉండాలి
* ఉన్నతాధికారులతో సమీక్షలో మంత్రి ఉత్తమ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నీటి పారుదల ప్రాజెక్టు పనుల్లో ఆలస్యాన్ని సహించేది లేదని అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttamkumar reddy) ఆదేశించారు. నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సెల్బీసీ, డిండి, పాలమూరు-రంగారెడ్డి (Palamuru-rangareddy) ప్రాజెక్టు పనుల్లో ఆలస్యాన్ని సహించబోమని అధికారులను హెచ్చరించారు. నీటిపారుదల సంఘం పారదర్శకంగా ఉండాలన్నారు. ప్రాజెక్టుల పురోగతిపై పర్యవేక్షణ పెంచాలని తెలిపారు. రాజస్థాన్లో నీటి పారుదల శాఖ అధికారుల సమావేశానికి నివేదిక రూపొందించాలని సూచించారు. డిజిటల్ మానిటరింగ్, ఆధునిక నీటి నిర్వహణపై ప్రజెంటేషన్ చేయాలన్నారు. రాష్ట్రంలో నీటి నిల్వల పెంపుపై దృష్టి సారించాలన్నారు. ప్రధాన ఆనకట్టల వినియోగంపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారు.
…………………………………………..