* త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
* రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఆకేరు న్యూస్, డెస్క్ : మన ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలం రాజ్యాంగం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) అన్నారు. ప్రజల స్వాభిమానాన్ని కాపాడే ఎన్నో హక్కులను రాజ్యాంగం మనకు ఇచ్చిందని గుర్తు చేశారు. ఢిల్లీలో సంవిధాన్ సదన్ లోని సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవ సభ నిర్వహించారు. రాష్ట్రపతి ముర్ము ఆధ్వర్యంలో ఈ సభ కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి (President of India) మాట్లాడుతూ.. రాజ్యాంగంలో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశారన్నారు. సామాజిక న్యాయ సాధనలో భాగంగానే ఈడబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు అన్నారు. భారత్ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతించబోతుందని తెలిపారు. ఆర్థిక ఏకీకరణలో భాగంగా జీఎస్టీ తీసుకొచ్చామని వెల్లడించారు. దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో రాజ్యాంగమే మార్గదర్శి అని వివరించారు. శాసనాల్లో ఎన్ని మార్పులు చేసినా రాజ్యాంగానికి లోబడి ఉన్నామన్నారు. ఇటీవలే బిర్సాముండా 150వ జయంతిని జరుపుకున్నట్లు తెలిపారు. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని మోదీ(Modi), లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అగ్రనాయకులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితర ప్రముఖులు ఈ సభలో పాల్గొన్నారు.
………………………………………………
