
* జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి
ఆకేరు న్యూస్ , కమలాపూర్ : ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరునికి నిరసనలు తెలిపే హక్కు ఉంటుందని కానీ దాడులకు పాల్పడే హక్కు మాత్రం ఎవరికీ ఉండదని జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి iVASU VADLURI) అన్నారు. మంగళవారం కమలాపూర్ మండల కేంద్రంలో వాసు వడ్లూరి విలేకరులతో మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్ లింగ్య నాయక్ లపై లెగిశెర్ల గ్రామస్తుల దాడిని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ ఖండిస్తుందన్నారు. లెగిశెర్ల గ్రామస్తులతో మాట్లాడేందుకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ తో పాటు రెవెన్యూ అధికారులు, సిబ్బందిపై రాళ్లతో, కర్రలతో దాడి చేయటం ఆటవిక చర్యగా వాసు అన్నారు. కావాలనే దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని వాసు వడ్లూరి డిమాండ్ చేశారు. లెగిశెర్ల గ్రామస్తుల సమస్యల పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. కార్యక్రమంలో మారముల కిరణ్ కుమార్, బీసీ సీనియర్ నాయకులు సంధ్యేల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
…………………………………………….