
* నియంతృత్వంపై నిరంతర పోరాటం
* ప్రజాస్వామ్య హక్కుల కోసం అలుపెరుగని పోరాటం
* నోబెల్ బహుమతి పొందిన పిన్న వయస్కురాలు
* వెనుజులా దేశంలో సంబరాలు
* ప్రపంచ దేశాల హర్షం
ఆకేరు న్యూస్ డెస్క్ : ప్రజాస్వామ్య హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన వెనుజులా దేశానికి చెందిన ప్రతిపక్ష నాయకురాలు, వెంటే వెనుజులా పార్టీకి మరియా కొరీనా మచాడో కు ప్రపంచంలోనే అత్యున్నత నోబెల్ పురస్కారం లభించింది. ఈ విషయాన్ని నోబెల్ కమిటీ (Nobel Committee) తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది. 2025 సంవత్సరానికిగాను మచాడో నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు.మరియా కొరీనా.. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకుగానూ ఈ పురస్కారం లభించింది. ఇదిలావుంటే హిరోషిమా, నాగసాకిల్లో అణుదాడి నుంచి బయటపడిన బాధితుల పక్షాన పోరాడుతోన్న జపాన్‌కు చెందిన ‘నిహాన్ హిడాంక్యో’ సంస్థకు గత ఏడాది నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఈ ఏడాది ప్రజలను ప్రభావితం చేసిన 100 మంది జాబితాలో మరియా కొరినా మచాడో చోటు సంపాదించుకున్నారు. మరియా కొరినా మచాడో 1967 అక్టోబర్ 7 న వెనిజులాలోని కారకాస్‌లో జన్మించారు జన్మించారు. వెనుజులా రాజకీయాల్లో రాణిస్తున్న ఈమె వృత్తి రీత్యా పారిశ్రామిక ఇంజనీర్ గా పనిచేశారు. మచాడోకు ముగ్గురు సంతానం .మచాడో 2002లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2012 లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి హెన్రిక్ కాప్రిల్స్ చేతిలో ఓడిపోయారు . 2014 వెనిజులా నిరసనల సమయంలో, ఆమె అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరిగిన ఉద్యమానికి మరియా కొరినా మచాడో నాయకత్వం వహించారు. దేశంలో పౌరుల హక్కులు కాలరాయబడుతున్నాయని పౌరుల హక్కులను కాపాడేందుకు ఆమె అలుపెరుగని పోరాటం చేశారు. ప్రభుత్వం ఎన్ని నిర్భంధాలు విధించినా ధైర్యంగా ముందుకు సాగారు. కొన్ని రోజులు అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చినా రెట్టించిన ధైర్యంతో మళ్లీ ప్రజాజీవితంలోకి వచ్చారు . పౌరుల హక్కుల కోసమే కాకుండా ఆమె అనాధ పిల్లలు బాల నేరస్థుల సంస్కరణ కోసం విశేష కృషి చేశారు. ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం నోబెల్ శాంతి బహుమతి ఆమెను వరించించింది.
…………………………………….