
* వనపర్తి జిల్లాలో అంతుచిక్కని వ్యాధి?
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఏపీలో బర్డ్ ఫ్లూ (Bird Flu) కలకలం సృష్టిస్తూనే ఉంది. ఆ మహమ్మారికి కోట్లాది కోళ్లు బలయ్యాయి. పౌల్ట్రీ పరిశ్రమ ఆర్థికంగా కుదేలవుతోంది. తెలంగాణ (Telangana) లో కూడా అక్కడక్కడ బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో వనపర్తి (Wanaparthy) జిల్లా మదనపురం (Madanapuram) మండలం కొన్నూర్ (Konnur) గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో భారీ సంఖ్యలో కోళ్లు మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కొన్నూర్‌లో కోళ్ల మరణానికి కారణమైన వ్యాధి బర్డ్ ఫ్లూలా లేదని, ఏదో అంతుచిక్కని వ్యాధి అందుకు కారణమైందని వనపర్తి జిల్లా వెటర్నరీ అండ్ యానిమల్ హజ్బెండరీ అధికారి కే వెంకటేశ్వర్ చెప్పారు. ‘కొన్నూర్‌లోని ఓ ఫామ్‌లో 2,500 కోళ్లు మృత్యువాతపడ్డాయి. మేం ఆ గ్రామానికి వెళ్లి పరిశీలించాం. శాంపిల్స్ సేకరించి టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపించాం.’ అని ఆయన చెప్పారు. ‘కొన్నూర్‌లోని శివకేశవులుకు చెందిన ప్రైమరీ ఫామ్‌లో ఈ కోళ్ల మరణాలు జరిగాయి. ఆ ఫామ్ మొత్తం కెపాసిటీ 5,500 కోళ్లు. వాటిలో ఈ నెల 16న 117 కోళ్లు, 17న 300 కోళ్లు, 18న మిగతా కోళ్లు మరణించాయి. దాంతో తాము ఈ నెల 19న కొన్నూర్‌కు వెళ్లి, శాంపిల్స్ సేకరించి, టెస్టింగ్ కోసం పంపించాం’ అని వెంకటేశ్వర్ తెలిపారు.
……………………………………………