* ఆర్టీసీ జాబ్స్‌కు డిసెంబర్లో నోటిఫీకేషన్
* 84 ట్రాఫిక్ సూపర్వైజర్స్ 114 సూపర్వైజర్స్ నియామకాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. డిసెంబర్ చివరి వారంలో 84 ట్రాఫిక్ సూపర్వైజర్స్ ట్రైనీ, 114 సూపర్వైజర్స్ ట్రైనీ నియామకాలు చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ టీజీపీఎస్సీ లేదా పోలీస్ బోర్డు ద్వారా చేపట్టనున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ ఆదాయంపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మహాలక్ష్మీ పథకంపై వివరాలు సేకరించారు. మహిళలు ఉపయోగించుకున్న 237 కోట్ల జీరో టికెట్ తో సంస్థకు రూ. 7980 కోట్ల ఆదాయం వచ్చిందని ఆ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించిందన్నారు. నష్టాల్లో ఉన్న డిపోలను లాభాల్లోకి తీసుకువచ్చేందుకు కమిటీ వేయాలని ఆర్టీసీ ఎంపీ నాగిరెడ్డిని ఆదేశించారు. ఆర్టీసీలో 1000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులను భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే.
మహా మేడారానికి 3800 బస్సులు..
మహా జాతర మేడారానికి 3800 బస్సులను నడపనున్నట్లు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆర్టీసీలో మహాలక్ష్మీ పథకం అమలుతో ఈ సారి సంస్థకు ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరగనుందని అధికారులు అంచనా వేశారు. అంతకు ముందు జాతరకు 3490 బస్సులను వినియోగించుకుందని.. మహాలక్ష్మీ పథకం నేపథ్యంలో 3800 బస్సులను నడిపేందుకు అధికారులు ఫ్లాన్ చేశారు. 20 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదాల నివారణకు ఆర్టీసీలో లహరి, గరుడ, రాజధాని బస్సుల్లో అమలవుతున్న డ్రైవర్ మానిటరింగ్ సిస్టం తీరును అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీలో నెలకొన్న సమస్యలపై అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు, కార్మికులు కలిసికట్టుగా పని చేసి సంస్థను మరింత లాభాల్లోకి తీసుకురావాలని సూచించారు.
