
* ప్రజావాణిలో పాల్గొనలేనివారి కోసం..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ గ్రీవెన్స్‌ను (WhatsApp Grievance) నేటి (జులై 28) నుంచి హైదరాబాద్‌లో అందుబాటులోకి తీసుకువచ్చిందని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన (Hyderabad Collector Harichandana) ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజావాణికి రాలేని వారు 7416687878 నెంబర్‌కి వాట్సాప్‌లో ఫిర్యాదులు చేయొచ్చని తెలిపారు. ప్రజావాణికి రాలేని దివ్యాంగులు, వృద్ధులు, ఉద్యోగులకు వాట్సాప్ గ్రీవెన్స్ ఫెసిలిటీ ఉపయోగంగా ఉంటుందని అన్నారు. కంప్లెయింట్‌ను పరిశీలించి యూనిక్ ఐడీ ఇచ్చి, అక్నాలెడ్జ్మెంట్ ను వాట్సాప్‌లోనే పంపుతామని వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కరానికి సంబంధిత అధికారులకు ఫిర్యాదులని కేటాయిస్తామని పేర్కొన్నారు. సిటిజన్ ఫ్రెండ్లీ గవర్నెన్స్‌లో భాగంగా వాట్సాప్ గ్రీవెన్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని కలెక్టర్ తెలిపారు.
……………………………………