
* ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
* ఇఫ్లూ యూనివర్సిటీతో ఒప్పందం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నర్స్ ట్రేనింగ్ పూర్తి చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.రానున్న రోజుల్లో జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో పనిచేయడానికి వీలుగా ప్రభుత్వం ఇఫ్లూ యూనివర్సిటీతో మంగళవారం ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ గత ఏడాది 7 వేల నర్సింగ్ పోస్టులను భర్తీ చేశామన్నారు. ఈ ఏడాది మరో 2 వేల 322 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. నర్స్ ట్రేనింగ్ పూర్తి చేసుకున్న వారు విదేశాల్లో ఉద్యోగం చేయడానికి వీలుగా ఇఫ్టూ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. నర్సింగ్ ట్రేనింగ్ తో పాటు రెండేళ్లు తమకు ఇష్టమైన విదేశీ భాషను నేర్చుకునే అవకాశం కల్పించామని మంత్రి తెలిపారు.దీంతో నర్సింగ్ పూర్తయ్యే లోపే విదేశీ భాష నేర్చుకోవడం పూర్తవుతుందని మంత్రి తెలిపారు. విదేశాల్లో నర్సింగ్ పోస్టులకు భారీగా అవకాశాలు ఉన్నాయన్నారు. భవిష్యత్లో విదేశాల్లో ఉద్యోగం చేసుకునే అవకాశం మన నర్సింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు లభిస్తుందని మంత్రి దామోదర రాజ నర్సింహ అన్నారు.
……………………………………..