
* 9 నెలల్లో అధికారంలోకి రావడం ఎవరికీ సాధ్యం కాదు
* ఎన్నో చరిత్రలను సృష్టించిన పార్టీ టీడీపీ
* పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో చంద్రబాబునాయుడు
ఆకేరు న్యూస్, మంగళగిరి : ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు (AP CM CHANDRABABU NAIDU) అన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరి టీడీపీ ఆఫీసు(TDP OFFICE)లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 43 ఏళ్ల టీడీపీ నాశనానికి ప్రయత్నించినవారు కాలగర్భంలో కలిసిపోయారని తెలిపారు. చాలా పార్టీలు వచ్చి కనుమరుగైపోయాయన్నారు. 43 ఏళ్లలో ఎన్నో చరిత్రలను సృష్టించామన్నారు. గుప్తుల కాలం గురించి చెప్పుకున్నట్టే తెలుగుదేశం గురించి చెప్పుకుంటారని అన్నారు. వెనుకబడవర్గాల పార్టీ టీడీపీ అన్నారు. వారిని ఆర్థికంగా, సామాజికంగా పైకి తెచ్చిన పార్టీ అన్నారు. ఆడపడుచులకు అండగా నిలిచిన పార్టీ, అన్నదాతలకు అండగా నిలిచిన పార్టీ అందరికీ న్యాయం చేసే ఏకైక పార్టీ, ఏకైక జెండా తెలుగుదేశం జెండా అన్నారు. తెలుగువారికి గుర్తింపు తెచ్చిన జెండా అన్నారు. రైతులు, సామాన్యులకు బాసటగా నిలిచిన జెండా పసుపు జెండా అన్నారు. నిరుపేదలకు నీడ ఇచ్చే ఇల్లు, అన్నదాతలకు అండగా నాగలి, కార్మికులు, పారిశ్రామిక ప్రగతికి చక్రం అన్నారు. 9నెలల్లో అధికారంలోకి రావడం అందరికీ సాధ్యం కాని ఘనత అన్నారు. అది ఎన్టీఆర్ (NTR)లాంటి యుగపురుషులకే సాధ్యమన్నారు.
………………………………………………