
* పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం
ఆకేరున్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంను టార్గెట్ చేసి న్యూడ్ కాల్స్‌తో బెదిరింపులకు దిగారు. న్యూడ్ వీడియో కాల్‌ను రికార్డు చేసి ఆయన మొబైల్‌కు పంపించడమే కాకుండా.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వేముల వీరేశంకు మంగళవారం రాత్రి సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేసి కాల్ లిఫ్ట్ చేయగానే అవతలి అమ్మాయి నగ్నంగా కనిపించగానే.. వేముల వీరేశం ఫోన్ కట్ చేశాడు. కానీ అదంతా స్క్రీన్ రికార్డు చేసిన సైబర్ నేరగాళ్లు.. ఆ వీడియోను మళ్లీ ఎమ్మెల్యేకే పంపించారు. తమకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆ వీడియోను కుటుంబసభ్యులు, మిత్రులకు పంపించడమే కాకుండా సోషల్‌మీడియాలో అప్లోడ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కానీ ఆయన స్పందించకపోవడంతో ఆ వీడియోను కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు పంపించారు. ఆ వీడియో చూసిన వెంటనే సదరు నేతలు, కార్యకర్తలు వేముల వీరేశానికి ఫోన్ చేసి ఆరా తీశారు. దీంతో కంగుతిన్న ఎమ్మెల్యే.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
………………………………………..