– ఎన్నికలు రాగానే ఓట్ల కోసం హుజూరాబాద్ వైపు వస్తున్నారు
– హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్
– సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రణవ్
ఆకేరు న్యూస్, కమలాపూర్ : గ్రామాల్లో సమస్యలను తీర్చే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులని సర్పంచ్ గా, వార్డ్ మెంబర్లుగా ఎన్నుకొని సమస్యలు తీర్చేలా గ్రామాల అభివృద్ధికి నాంది పలకాలని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ అన్నారు. మంగళవారం కమలాపూర్ మండలంలోని భీంపల్లి, గోపాల్పూర్,శనిగరం, లక్ష్మీపూర్, నేరెళ్ల, గూనిపర్తి, శ్రీరాములపల్లి గ్రామాలలో ఆయన విస్తృతంగా రోడ్ షోలు నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధికే పట్టం కడుతున్నారని, కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నారని అన్నారు. బీఆర్ఎస్, బిజెపి పార్టీలు అభివృద్ధికి నిరోధకులుగా ఉన్నాయని అన్నారు. రెండేళ్లుగా హుజూరాబాద్ ప్రజల గురించి పట్టించుకున్న నాధుడు లేడని, ఎన్నికలు రాగానే ఓట్ల కోసం హుజూరాబాద్ వైపు వస్తున్నారని, ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ గడ్డకు రూపాయి నిధులైన తీసుకొచ్చాడా అని ప్రశ్నించారు.రెండేళ్లుగా తాను గెలిచినా, ఓడినా ప్రజల మధ్యలో ఉంటున్నానని అన్నారు.కమలాపూర్ మండలంలోని ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో కమలాపూర్ మండల,గ్రామాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

………………………………….
