
ఆకేరు న్యూస్, ములుగు: ఇటీవల కురిసిన ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు ములుగు జిల్లా వ్యాప్తంగా వందలాది ఎకరాలలో ఇసుకమేటలు వేశాయి. దీంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని మంగపేట ,ఏటూర్ నాగారం, కన్నాయి గూడెం, తాడువాయి గోవిందరావుపేట, ములుగు, వెంకటాపూర్ ,వెంకటాపురం, మల్లంపల్లి , వాజేడు తదితర మండలాల్లో విస్తారంగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పంట పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.అంతేకాకుండ చిన్న చిన్న చెరువులు కుంటలు తెగిపోయాయి.మరో రేండు నెలల పాటు వరి పంట పొలాలకు నీరు అందని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
………………………………………..