
* అడ్డుకున్న భూ నిర్వాసిత రైతులు
ఆకేరు న్యూస్, వరంగల్ : మామునూరు విమానాశ్రయ (MAMUNUR AIRPORT) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సర్వే కోసం వెళ్లిన అధికారులను భూ నిర్వాసిత రైతులు అడ్డుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గుంటూరు పల్లె వద్ద భూములు కోల్పోతున్న రైతులు వరంగల్ – నెక్కొండ జాతీయ రహదారి(WARANGAL-NEKKONDA NATIONAL HIGHWAY)పై ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎయిర్ పోర్టు నిర్మాణంలో రెండు గ్రామాలను కలిపే రోడ్డును తాము కోల్పోతున్నామని, తమకు కొత్త రోడ్డు నిర్మించి బాధితులకు మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై పరకాల ఎమ్మెల్యేతో మాట్లాడగా, మీకు రోడ్డు లేదూ.. ఏమీ లేదూ అని దురుసుగా మాట్లాడారని ఆరోపించారు.
…………………………………………..