
– రైతులకు భవిష్యత్తు భరోసాగా ఆయిల్ ఫామ్ తోటల సాగు
– గూడూరులో రైతులకు ఫామ్ ఆయిల్ పై అవగాహన సదస్సు
ఆకేరు న్యూస్, కమలాపూర్ : ఆయిల్ ఫామ్ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హార్టికల్చర్ ఆఫీసర్ మధులిక అన్నారు.సోమవారం కమలాపూర్ మండలంలోని గూడూర్ గ్రామ రైతు వేదికలో కే.ఎన్. బయోసైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్ ఫామ్ తోటల సాగు పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. భవిష్యత్తులో ఆయిల్ ఫామ్ 100% భరోసా కల్పిస్తుందని ఆమె అన్నారు. అనంతరం కే.ఎన్ బయో సెన్సెస్ డిస్టిక్ మేనేజర్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ …ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులు ముందుకు రావాలన్నారు. సాగు చేసే రైతులకు ఆయిల్ ఫామ్ టన్నుకు ధర 21000 ఉందని, భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లి, ఎల్కతుర్తి మండలం లోని బావపేట్ లో ఆయిల్ ఫామ్ గెలల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలోనే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని కూడా ములుగులో నిర్మించినున్నట్టు ఆయన తెలిపారు. ఎరువుల నీటి యజమాన్య పద్ధతులపై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఫామ్ ఆయిల్ సాగు చేసే రైతులు తోటలకు తీసుకోవాల్సిన యజమాన్య పద్ధతులు, డ్రిప్పు ద్వారా ఎరువులు పంపే విధానాన్ని సైంటిస్ట్ రాజశేఖర్ రెడ్డి రైతులకు వివరించారు.ఆయిల్ ఫామ్ సాగు చట్టబద్ధతతో కూడుకున్నదని రైతులు సందేహ పడాల్సిన అవసరం లేదని, మంచి యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి మధులిక, కేన్ బయో సైన్స్ ప్రతినిధి హేమంత్ కుమార్, డిస్ట్రిక్ట్ మేనేజర్ రంజిత్ కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ మహిపాల్, ఏఈఓ ప్రశాంత్,రైతులు తదితరులు పాల్గొన్నారు.
………………………………………………………..