* హరీష్ రావుపై మంత్రి అడ్లూరి ఫైర్
* సిద్దిపేట వేంకటేశ్వరాలయంలో ప్రమాణం చేద్దామని సవాల్
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ అయ్యారు..
హరీష్ రావు సెంటిమెంట్ గా భావించే సిద్దిపేట వెంకటేశ్వరాలయంలో శనివారం రోజు ఇద్దరం ప్రమాణం చేద్దామా అంటే సవాల్ విసిరారు. మంత్రి వర్గాన్ని హరీష్ రావు దండుపాళ్యం బ్యాచ్ అంటూ విమర్శించడంపై లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ మీటింగ్ లో ఎలాంటి వ్యక్తిగత విషయాలు చర్చించలేదని అడ్లూరి అన్నారు. కొండా సురేఖ అంశాన్ని కేబినెట్ లో చర్చించాల్ని అవసరం లేదన్నారు. కొండా సురేఖ మా అందరికీ బిడ్డ లాంటిదని అన్నారు. కేబినెట్ మీటింగ్ లో చర్చకు రాని అంశాలను చర్చకు వచ్చినట్లుగా బీఆర్ ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని అడ్లూరి మండి పడ్డారు.
కేబినెట్ మంత్రులను దండుపాళ్యం బ్యాచ్ అంటారా అంటూ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలపై దాదాపు 600 పైగా ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపై గత ప్రభుత్వం క్రూరంగా ప్రవర్తించిందని విమర్శించారు. శాశ్వతంగా అధికారంలో ఉంటామనే భ్రమలో బీఆర్ ఎస్ నేతలు నియంతలుగా ప్రవర్తించారని అడ్లూరి ఆరోపించారు. హరీష్ రావు అన్న వ్యాఖ్యల్లో నిజం ఉంటే వేంకటేశ్వర స్వామికి ఇష్టమైన శనివారం రోజున సిద్దిపేట వేంకటేశ్వరాలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధమేనా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అనుమతితో తాను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని దమ్ముంటే హరీష్ రావు సిద్ధమేనా అని ప్రశ్నించారు.
………………………………………………………..
