
* ఆందోళన బాట పట్టిన రైతులు
ఆకేరున్యూస్, జనగామ: గోదావరి జలాలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ రైతులు జనగామ జిల్లాలో ఆందోళన బాట పట్టారు. జనగామ మండలం వడ్లకొండ దగ్గర ఉన్న ఇరిగేషన్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. అనంతరం జనగామ- హుస్నాబాద్ ప్రధాన రహదారిపై పెద్దపాడు, పెదరామచర్ల, ఓబుల్ కేశవపూర్, బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామాల రైతులు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బోరుబావులు ఎండిపోకుండా ఉండాలంటే జిల్లాలో ఉన్న చెరువులను కుంటలను గోదావరి నీటితో నింపాలని డిమాండ్ చేశారు. గోదావరి జలాలు విడుదల చేస్తే కొద్దిగా గొప్ప పంటలు వేసుకోవడానికి వీలుంటుంది అన్నారు. కరువు ప్రాంతమైన జనగామ పై ప్రభుత్వం పట్టించుకొని గోదావరి కాలువలకు నీటిని విడుదల చేయాలన్నారు.ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు రైతుల బాధను పట్టించుకుని కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలని వేడుకున్నారు. ధర్నా నిర్వహిస్తున్న రైతులను పోలీసులు సర్దిచెప్పి ధర్నాను విరివింప చేశారు. అనంతరం ఇరిగేషన్ అధికారులు కలిసి నీటిని విడుదల చేయాలని వినతిపత్రం సమర్పించారు.
………………………………