
* భామలు చూసేందుకు టైం ఉంది కానీ.. బాధలు వినే తీరిక లేదా
* తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ధ్వజం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మార్పు.. మార్పు అంటూ వచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లిని మార్చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harishrao) విమర్శించారు. ఉద్యమంలో ఒక తల్లి, అధికారంలోకి వచ్చాక మరో తల్లి ఉంటుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమంలో స్ఫూర్తినిచ్చిన తల్లిని మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం వైఖరిలో రేవంత్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శించారు. బీఆర్ ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. ఇదే రేవంత్ రెడ్డి (Revanthreddy) ఒకసారి అధికారిక ముద్రలో కాకతీయ కళాతోరణం తీసేస్తా అంటాడని, మరోసారి చార్మినార్ లేపేస్తా అంటాడని విమర్శించారు. అందాల పోటీలకు సీఎం ఐదు సార్లు హాజరయ్యారని, భామలను చూసేందుకు టైమ్ ఉంది కానీ, మార్కెట్ యార్డులకు వెళ్లి రైతుల దగ్గర నుంచి వడ్లు ఎందుకు కొనడం లేదని ప్రశ్నించేందుకు టైం లేదా అని ప్రశ్నించారు. జనుము, జీలుగు విత్తనాలు ఎందుకు దొరకడం లేదని అన్నదాతల కష్టాలు వినే తీరిక లేదా అన్నారు. అందాల పోటీల్లో పాల్గొనేందుకు విదేశాల నుంచి వచ్చిన మహిళలతో కాంగ్రెస్ నాయకులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. దేశ పరువుతో పాటు, రాష్ట్ర పరువును గంగలో కలిపేశారని ఆక్షేపించారు.
……………………………………………..