
* పందిరి తొలగిస్తుండగా ప్రమాదం
ఆకేరున్యూస్, హైదరాబాద్ :విద్యుత్ తీగలు, కేబుల్ వైర్లు చావులకు కేరాఫ్ అడ్రస్ గా మారాయి. ఇటీవల విద్యుదాఘాత మరణాలు ఎక్కువయ్యాయి. రామాంతాపూర్ లో కృష్ణాష్టమి రోజు రథం లాగుతూ విద్యుదాఘాతానికి గురై ఆరుగురు వ్యక్తులు మృతి చెందగా పాతబస్తీ లో వినాయకుని విగ్రహం తరలిస్తుండగా విద్యుదాఘాతంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు, ఈ ఘటనలు మరువక ముందే తాజాగా సికింద్రాబాద్ లోని తిరుమల గిరి ప్రాంతంలో మరో ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరిలోని సరస్వతి నగర్ లో ఓ శుభకార్యానికి వేసిన పందిరిని తొలగిస్తున్న సమయంలో విద్యుదాఘాతానిక గురై ఓ వ్యక్తి మృతి చెందగా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. పందిరిని నిచ్చెన వేసుకొని తొలగిస్తున్న సమయంలో ఇనుపరాడ్ కు విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతం జరిగింది. ఈ ఘటనలో విజయ్ అనే వ్యక్తి మృతి చెందగా మిగతా ఇద్దరికి గాయాలయ్యాయి. ఘటనకు సంబందించిన దృశ్యాలు సీసీ కెమరాలో రికార్డు అయినట్లు పోలీసులు తెలిపారు.
…………………………………………..