* విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లలో..
* బినామీ ఇంట్లో పట్టుబడిన రూ.2 కోట్ల నగదు, బంగారం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌కు చెందిన విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ అంబేద్కర్ బినామీల ఇళ్లలో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. ఏడీఈ బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లలో అధికారుల సోదాలు గచ్చిబౌలి , మాదాపూర్ , హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లో మొత్తం 18 చోట్ల కొనసాగుతున్నాయి. బినామీ సతీశ్ ఇంట్లో రూ.2 కోట్ల నగదుతోపాటు భారీగా బంగారం కూడా పట్టుబడింది. ఈ బంగారం విలువను కూడా అధికారులు లెక్కిస్తున్నారు. కాగా, అంబేద్కర్‌కు గచ్చిబౌలిలో భారీ భవంతి, సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌లో 10 ఎకరాల వ్యవసాయ భూమి, ఫామ్ హౌస్‌లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వాటి మార్కెట్ విలువ దాదాపు రూ.200 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. సోదాలు ముగిశాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు.
………………………………………
