
* ముంబై హైవేపై ట్రాఫిక్ జామ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఉల్లిగడ్డల లారీ బోల్తా పడి ట్రాఫిక్ జామ్ అయిన సంఘటన సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ వద్ద చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఉల్లిలోడుతో వెళ్తున్న లారీ ఇస్నాపూర్ వద్ద అదుపుతప్పి నేషనల్ హైవేపై డివైడర్‌ను ఎక్కించడంతో బోల్తాపడింది. దీంతో లారీలోని ఉల్లి బస్తాలు రహదారిపై పడిపోయాయి. సోమవారం మధ్యాహ్నం అవుతున్నప్పటికీ లారీని అక్కడి నుంచి తీయలేదు. మరోవైపు రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు నిదానంగా కదులుతుండటంతో ఓ అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. వాహనదారులు, యువత కలిసి డివైడర్‌పై నుంచి అంబులెన్స్‌ను రోడ్డు దాటించడంతో అది వెళ్లిపోయింది.
……………………………