* అవగాహన రాహిత్యం.. తొందరపాటుతనంతో సమస్యలు
* పేమెంట్ చేసే ముందు.. పరిశీలించండి..
* నకిలీ వెబ్సైట్లు, తెలియన లింకుల ద్వారా డబ్బు చెల్లించొద్దు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
కంప్యూటర్ యుగంలో అంతా ఆన్ లైనే. ఏ వస్తువు కొనాలన్నా.. అమ్మాలన్నా.. ఆన్ లైన్ లోనే. సాధారణ కరెన్సీ లావాదేవీల స్థానంలో, ఇప్పుడు ఎక్కువగా ఆన్ లైన్ లావాదేవీలే జరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు దీన్నే అవకాశంగా మార్చుకుని మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకుల ఖాతాలను కొల్లగొడుతున్నారు. ఈ తరహా మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఆన్ లైన్ లావాదేవీ చేపట్టిన హైదరాబాద్ యువకుడిని మోసం నేరగాల్లు రూ.లక్షను కాజేశారు.
నకిలీ వెబ్ సైట్లతో తస్మాత్ జాగ్రత్త
ఆన్ లైన్ లో కొనుగోళ్లు, పేమెంట్స్ చేసేటప్పుడు ఆయా వెబ్ సైట్లను చెక్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. మోసాల కోసమే సైబర్ నేరగాళ్లు అసలైన వాటిని పోలిన నకిలీ వెబ్ సైట్లు సృష్టిస్తున్నారు. అలాగే, తెలియని లింక్‌లపై క్లిక్ చేస్తే మోసపోయే ప్రమాదం ఉంది. మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారం దొంగిలించే అవకాశం ఉంది. వెబ్సైట్ యొక్క భద్రతా సర్టిఫికెట్‌ను పరిశీలించండి. వెబ్సైట్ ్ఖఖఔ ‘జ్ట్టిఞట://‘తో మొదలవుతుందో లేదో తనిఖీ చేయండి, ఇది సురక్షిత కనెక్షన్‌ను సూచిస్తుంది.మోసగాళ్లు కస్టమర్లకు తప్పుడు కస్టమర్ కేర్ నంబర్లను ఇస్తారు. బ్యాంక్ లేదా ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన ప్రతినిధిని మాట్లాడుతున్నానని నమ్మించి మోసం చేస్తారు. బ్యాంక్, ఇన్సూరెన్స్ కంపెనీల అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి మోసగాళ్లు ఇచ్చిన కస్టమర్ కేర్ నంబర్లను నిర్ధారించుకోవడం మంచిది. అలాగే, రిజిస్ర్టేషన్ సమయంలో తమ బ్యాంక్ ఖాతా, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు నమోదు చేసే వినియోగదారులను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు నకిలీ జాబ్ పోర్టల్‌ను ఉపయోగిస్తారు. అలాంటి పోర్టల్ పట్ల జాగ్రత్త వహించాలి.
ఆ మాటల్లో ఎంతో మాయ
మోసగాళ్లు బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును దొంగిలించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. మీ కేవైసీ వివరాలను అప్డేట్ చేస్తున్నట్లు, ఉద్యోగం వచ్చిదంటూ ఫోన్ చేసి, తీయగా మాట్లాడుతున్నారు. మాటలతో మభ్య పెట్టి, వారి చెప్పినట్లుచేసేలా ఆకట్టుకుంటున్నారు. లేకుంటే మీ ఖాతాను బ్లాక్ చేస్తామని బెదిరించడం ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ ఏజెంట్లు, హెల్త్‌కేర్, టెలికాం ఉద్యోగులు ప్రభుత్వ అధికారులుగా బ్యాంకు వినియోగదారులకు ఫోన్లు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.
హుక్కా కొంటే రూ.4లక్షలు హుళక్కు
ఇటీవల నగరానికి చెందిన ఓ యువకుడు హుక్కా యంత్రాన్ని కొనుగోలు చేసేందుకు ఆన్లైన్లో రూ.3 వేలు చెల్లించాడు. అతడి చెల్లింపులో సమస్య తలెత్తిందని, మరలా డబ్బు పంపిచాలని, సమస్య పరిష్కారం అయిన తర్వాత అదనంగా చెల్లించిన మోత్తాన్ని రిఫండ్ చేస్తామని నమ్మించారు. ఇందుకోసం బ్యాంకు పేరు చెప్పి ఓ వ్యక్తి మాట్లాడి మీరు చెల్లించిన డబ్బు ప్రాసెసింగ్‌లో ఉందని చెప్పాడు. ఇలా నమ్మించి బాధితుడి నుంచి పలు దఫాలుగా సుమారు రూ.4 లక్షలను తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. ఇదొక్క సంఘటనే కాదు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలువురు అవగాహన లేకుండా ఆన్లైన్లో డబ్బులు చెల్లిస్తూ సైబర్ మోసగాళ్ల బారిన పడుతున్న కేసులు సైబర్ క్రైం పోలీ్స్టషన్లలో నమోదువుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్లైన్ చెల్లింపులు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, తెలియని వెబ్సైట్లు, పేమెంట్ యాప్స్ ద్వారా డబ్బు చెల్లించొద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
……………………………………………..
