
* క్యాబినెట్ భేటీలో ప్రధాని మోదీ
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా బుధవారం తెల్లవారుజామున భారత బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దేశానికి గర్వకారణమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సేనలు దాడి చేసి దాదాపు 100 మంది ఉగ్రవాదులను హతమార్చడం దేశానికి గర్వకారణమన్నారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆపరేషన్ సిందూర్ గురించి సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా.. భారత సేనలు చేపట్టిన చర్యను క్యాబినెట్‌లోని మంత్రులంతా బల్లలు చరిచి సమర్థించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సేనలు బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్ నిర్వహించాయి. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడిచేసి దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్ అనంతరం ప్రధాని మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి ఆమెకు సమాచారం ఇచ్చారు.
…………………………………………..