ఆకేరు న్యూస్, ములుగు: రైతులు, విత్తన వ్యాపారులు, ఉత్పత్తిదారులు, నర్సరీల యజమానులు, ఇతర వాటదారుల నుండి కొత్త విత్తన బిల్లు-2025 ముసాయిదాపై అభిప్రాయాలను సేకరించడం జరిగినదని అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి తెలిపారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన కొత్త విత్తన బిల్లు-2025 ముసాయిదాపై జిల్లా స్థాయి సంప్రదింపుల సమావేశం, విస్తృత సేకరణ ములుగు జిల్లా లో రైతులు, విత్తన డీలర్లు, విత్తన ఉత్పత్తిదారులు, అన్ని సంబంధిత వర్గాలతో సంప్రదింపుల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కొత్త విత్తన బిల్లు-2025 లోని సెక్షన్లు మరియు క్లాసులు, విత్తన చట్టం 1966 లోని లోపాలు మరియు కొత్త విత్తన చట్టం 2025 లోని లక్ష్యాలు ప్రతి అంశంపై కూలంకషంగా చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన రైతులు, విత్తన వ్యాపారులు, విత్తన ఉత్పత్తిదారులు, నర్సరీల యజమానులు, ఇతర వాటదారులు బిల్లులోని ప్రతి క్లాజ్పై తమ సూచనలు అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సమావేశం లో జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, ఏటూరునాగారం అవినాష్ వర్మ, జిల్లాలోని అన్ని మండలాల మండల వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
