
* రాకపోకలకు అంతరాయం
* ఇబ్బందుల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు
ఆకేరు న్యూస్ డెస్క్ : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వరంగల్ పట్టణంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది.హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఎడతెరపిలేకుండా భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో హనుమకొండ బస్టాండ్, చౌరస్తా, వరంగల్, వరంగల్ రైల్వే స్టేషన్, కాజీపేట, హసన్‌పర్తి , మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ,గంగారం మండలాల్లో రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రెడ్డిపురం, గోకుల్‌నగర్, అంబేద్కర్ నగర్, న్యూ శాయంపేట, బట్టల బజార్, పాత బీటు బజార్లో రోడ్డపై హంటర్ రోడ్డు, ఎన్టీఆర్ నగర్, రామన్నపేట, శివనగర్, కరీమాబాద్, సాకరాశి కుంట లోతట్టు ప్రాంతాలు జలమయమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉర్సు గుట్ట సమీపంలోని డి.కె.నగర్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో గుడిసెవాసులను పునరావస కేంద్రాలకు తరలించారు. లోతట్టులోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. పలు వాగులు పొంగిపొర్లుతుండడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
…………………………………………