
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖా మంత్రి కొండా సురేఖ కు రేవంత్ రెడ్డి సర్కార్ షాక్ ఇచ్చింది . మంత్రి కొండా సురేఖ వద్ద ఓఎస్డీ గా పని చేస్తున్న సుమంత్ ను తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సుమంత్ ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయంటున్నారు. శాఖ లోని ఉన్నతాధికారులపై కూడా పెత్తనం చెలాయించే స్థాయికి ఎదిగాడన్న ఫిర్యాదులు అందాయన్న ప్రచారం ఉంది.. దీంతో సుమంత్ పై వేటు వేసినట్లు గా తెలుస్తోంది.
ఒకవైపు పొంగులేటి తో …
ఒక వైపు జిల్లాలోని కాంగ్రెస్ నేతలతో సఖ్యత లేకపోవడంతో అధిష్టానానికి పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు.. ఆ పంచాయితీ ముగియకముందే ఇటీవలే వరంగల్ జిల్లా ఇంచార్జీ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పెత్తనం వరంగల్ జిల్లాలో ఏంటి..? అని మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ ప్రశ్నించారు. అనంతరం మేడారం లో జరిగిన జాతర పనుల సమీక్షా సమావేశానికి మంత్రి కొండా సురేఖ హాజరు కాలేదు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత దేవాదాయశాఖ పనుల సమీక్షా సమావేశానికి హాజరు కాకపోవడం వెనుక కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు హనుమకొండ కు వస్తున్నారు. చిరకాల ప్రత్యర్థి గా ఉన్న దొంతి మాధవ రెడ్డి ఇంట్లో జరుగుతున్న కార్యక్రమానికి సైతం మంత్రి కొండా సురేఖ హాజరవుతారా లేదా అన్న చర్చ వరంగల్ లో ఉంది.
……………………………………………………………..