* ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్టు విమర్శిస్తున్న ఆంబోతుల నోటికి తాళం వేస్తా
* హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తా
* కార్యకర్తల కష్టసుఖాల్లో అండదండగా ఉంటా
* ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
ఆకేరున్యూస్, కమలాపూర్: హుజరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే మా అజెండా అని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని అంబాల గ్రామంలో ఆదివారం ఎమ్మెల్సీ పర్యటించి ఇటీవల కమలాపుర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా నియమితులైన దేశిని ఐలయ్యను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీని కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ… హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రజా సమస్యలను అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావాలని, ఇది ప్రజా ప్రభుత్వం అని, ప్రజల సమస్యలను పార్టీలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుందన్నారు, కానీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రజా సమస్యలపై కాకుండా కేటీఆర్ ఈ – రేసింగ్ , కేసిఆర్ కుటుంబ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తూ… ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల్ని పరిష్కరించడం లేదని హుజురాబాద్ ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు అంటున్నాడని ఆ ఆంబోతు నోటికి తాళం వేస్తానని పరోక్షంగా హెచ్చరించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం కుయుక్తులతో, ప్రస్తుత ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని వీటన్నిటిని దీటుగా ఎదుర్కొని బదులిస్తానని, నియోజకవర్గ అభివృద్ధితో పాటు , ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. కార్యకర్తల కష్టాల్లో అండదండగా ఉంటూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కమలాపుర్ మండలంలో పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన దేశిని ఐలయ్య కృషిని గుర్తించి కమలాపురం వ్యవసాయ మార్కెట్లో వైస్ – చైర్మన్గా నియామకం చేసామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరుకాల విరేశ లింగం, మార్కెట్ డైరెక్టర్ గట్టు శ్రీధర్, శివకృష్ణ, కొండ రమేష్, పోతిరెడ్డి ఓదెలు, హనుమాన్ల ప్రసాద్, మొగిలిచర్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
……………………………………………