
* ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు ఉపాధ్యాయులు
ఆకేరు న్యూస్, ములుగు: అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని ములుగు జిల్లా మంగపేట మండలం పి ఎం శ్రీ జెడ్పిహెచ్ఎస్ రాజుపేట, పాఠశాల లో పొగాకు రహిత సమాజ నిర్మాణం కోసం వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, యూత్ తో పాటు ఎకో క్లబ్ ఇన్చార్జి ఉపాధ్యాయులు వీరనారాయణ ఆధ్వర్యంలో రాజుపేట వీధుల్లో ర్యాలీ నిర్వహించారు .మెయిన్ రోడ్డు సెంటర్ లో పొగాకు సంబంధించిన ఉత్పత్తులవలన కలిగే నష్టాలను విద్యార్థులు ఉపాధ్యాయులచే అవగాహన కల్పించారు. 9,10 వ తరగతి విద్యార్థులచేత పొగాకు ఉత్పత్తుల వలన కలిగే నష్టాలకు సంబంధించిన నాటకం అందరినీ ఆకట్టుకున్నది. ప్రధానోపాధ్యాయులు బానోతు బాలాజీ మాట్లాడుతూ పొగాకు సంబంధిత ఉత్పత్తులైన అంబర్, గుట్కా, సిగరెట్టు సంబంధించిన వస్తువుల వినియోగం వలన శరీరము కృషించిపోయి తమ జీవితాలు నష్టపోయే పరిస్థితులు చూస్తున్నారన్నారు. పొగాకు వాడకం వల్ల నష్టాలను వాటి వలన కలిగే దుష్ఫలితాలను ప్రతి ఒక్కరికి తెలియజేసి పొగాకు రహిత సమాజ నిర్మాణంలో మనందరం భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఉపాధ్యాయ బృందము నాగమణి, జిఎస్ఎన్ ప్రసాద్, గణేష్, రామారావు, రాజ్యలక్ష్మి, పావని, G.శ్రీనివాస్ పద్మ,ప్రవీణ్ కుమార్, పోషన్న,సుజాత A.శ్రీనివాస్, మహాదేవి, రాజయ్య గార్లు జూనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు, విద్యార్థులుమరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
………………………………..