
* ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గత ప్రభుత్వం లాగా మాది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (DUDDILLA SRIDHAR BABU) అన్నారు. మేడ్చెల్ (MEDCHAL) పట్టణంలో జరిగిన ఓ కా ర్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు,(RATION CARDS) కల్యాణ లక్ష్మి,(KALYANA LAXMI) షాదీ ముబారక్ (SHADI MUBARAK)చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమపథకాలు అందుతాయని హామీ ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. మేడ్చెల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 40 వేల రేషన్ కార్డులు అందించామని అన్నారు మరో 60 వేల దరఖాస్తులు అందాయని వాటిని కూడా పరిశీలించి అర్హులందరికీ అందజేస్తామని అన్నారు.గతంలో రేషన్ కార్డుల కోసం మీ సేవా కార్యాలయాలు చుట్టూ తిరిగే వారని మంత్రి గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి,కలెక్టర్ మను చౌదరి,అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
………………………………………