
ఆకేరున్యూస్, హైదరాబాద్ : ఏపీ, తెలంగాణలో బీజేపీ రాష్ట్ర శాఖలకు అధ్యక్షులుగా ఎంపికైన
మాధవ్, రాంచందర్ రావులకు అభినందలు వెల్లువెత్తుతున్నాయి.బీజేపీ ఎంపీలు,ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇద్దరికీశుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.ఆంధ్రప్రదేశ్లో మీ సహకారంతో కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కృషి చేయాలని కోరుతూ పరస్పర సహకారంతోరాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అన్నారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇద్దరినీ అభినందిస్తూ ట్వీట్ చేశారు.రాంచందర్ రావు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా చురుకైన పాత్ర పోషించారని అన్నారు. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇద్దరిని ఉద్దేశించి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
…………………………………………