
* దేశ వ్యాప్తంగా ఆందోళనలు
ఆకేరు న్యూస్, డెస్క్ : పార్లమెంట్లో కేంద్ర ఆమోదించిన వక్ఫ్ బిల్లుకు నిరసనగా దేశ వ్యాప్తంగా కొద్ది రోజులుగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ (Congress Party) దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇదిలా ఉండగా ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ(Telangana)లోని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనూ ముస్లిం మైనార్టీలు…నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ సంఘం ఆధ్వర్యంలో తమ వ్యాపార వాణిజ్య సముదాయాలను బంద్ చేసి నిరసించారు. బంధ్ నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజ్యాంగంలోని లౌకిక వాదానికి భిన్నంగా కేంద్రం ప్రభుత్వం…వక్ఫ్ బోర్డు చట్టాన్ని తీసుకువచ్చిందని సీపీఐ (CPI) జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. దేశంలో పేదలకు కూడు గూడు నీడ ఉపాధి కల్పించడంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమైందని ఆయన మండిపడ్డారు. ఇక పశ్చిమ బెంగాల్(West Bengal)లోని ముర్షిదాబాద్‌లో తీవ్రస్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి. శనివారం రోజున మాల్డా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు 110 మందికి పైగా నిరసనాకారులను అరెస్టు చేశారు.
………………………………………