
* సంవత్సర కాలంలోనే రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నుంచి రాష్ట్ర కార్యదర్శిగా పదోన్నతి..
ఆకేరు న్యూస్, అమరావతి : తక్కువ సమయంలో పార్టీ అధినేత జగన్ మనసును గెలుచుకొని పల్నాడు జిల్లా నేతల ఆశీస్సులతో పల్నాడు జిల్లా వైఎస్సార్ యువజన_విభాగం అధ్యక్షుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి అంచలంచలుగా ఎదుగుతూ సత్తెనపల్లి నియోజకవర్గ పరిశీలకుడు గా, సత్తెనపల్లి నియోజకవర్గ ఎలక్షన్ఇ న్చార్జిగా, తూర్పుగోదావరి జిల్లా అనుబంధ విభాగాల_పరిశీలకుడిగా సేవలు అందించారు. ఇప్పటివరకు రాష్ట్ర జాయింట్ సెక్రటరీగాను , ప్రస్తుతం సత్తెనపల్లి పరిశీలకులుగా విధులు నిర్వహిస్తున్న పడాల శివారెడ్డికి రాష్ట్ర కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు. రానున్న రోజుల్లో అధిష్టానం దిశా నిర్దేశం అనుసరించి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేసే విధంగా తన సేవలు ఉంటాయని పడాల శివారెడ్డి పేర్కొన్నారు. తన ఎదుగుదలకు సహకరించిన పల్నాడు జిల్లా వైసీపీ నేతలు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కాసు మహేష్ రెడ్డికి మాజీ మంత్రి విడదల రజినీకి, నంబూరు శంకర్రావు కు బొల్లా బ్రహ్మనాయుడు కు గజ్జల సుధీర్ భార్గవ రెడ్డికి మాజీ మంత్రి అంబటి రాంబాబుకి పెద్దలు వైవి సుబ్బారెడ్డి కి సజ్జల రామకృష్ణారెడ్డికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
………………………………..