Padi Kaushik Reddy
*అమెరికా వెళ్లి వచ్చేలోపు ఏమైనా జరగొచ్చు..
* ఖమ్మం, నల్లగొండ మంత్రులు కాచుకుని ఉన్నారు..
* ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సంచలన కామెంట్లు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) మాట్లాడుతూ.. కొందరు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ( Padi koushik Reddy, MLA ) సైటెరికల్ కౌంటర్ ఇచ్చారు. కొందరు ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు తర్వాత సంగతి.. సీఎం రేవంత్ అమెరికా వెళ్లి వచ్చే వరకు ఆయన సభ్యత్వం ఉంటుందో లేదో చూసుకోవాలంటూ ఎద్దేవా చేశారు. ఖమ్మం, నల్లగొండ మంత్రులు ఆయన సభ్యత్వం రద్దు చేసేలా ఉన్నారంటూ సెటైర్లు వేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి బెదిరిస్తే ఇక్కడ భయపడే వాళ్లు ఎవరూ లేరన్నారు. అసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదని ఆరోపించారు. సబితా ఇంద్రారెడ్డిని అవమానించినందుకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ ప్రజలకు రెండో విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలన్నారు. హుజురాబాద్‌లో అగ్నిప్రమాదం జరిగితే ప్రభుత్వం స్పందించలేదన్నారు. తన జీతం నుంచి బాధితులకు రూ.4 లక్షలు ఇచ్చానని చెప్పారు. హుజురాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మిత్రుడు మీడియా వాళ్లను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.
—————————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
