పద్మ పురష్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
* 5 మందికి పద్మ విభూషణ్
* 13 మంది కి పద్మ భూషణ్
* 113 మందికి పద్మశ్రీ
ఆకేరు న్యూస్, డెస్క్ : రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది.
ఈ ఏడాది మొత్తం 131 పురస్కారాల్లో 5 పద్మ విభూషణ్, 13 పద్మ భూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి.
పద్మ విభూషణ్ పొందిన వారు
1.ధర్మేంద్ర సింగ్ డియోల్ (మరణానంతరం) | కళలు, మహారాష్ట్ర బాలీవుడ్ ‘హీ-మ్యాన్’గా దశాబ్దాల పాటు భారతీయ సినిమాకు అందించిన సేవలు 2. వి.ఎస్. అచ్యుతానందన్ (మరణానంతరం) ప్రజా వ్యవహారాలు , కేరళ మాజీ ముఖ్యమంత్రిగా, నిబద్ధత గల రాజకీయ నాయకుడిగా పనిచేశారు.3. కె.టి. థామస్ , ప్రజా వ్యవహారాలు కేరళ కు చెందిన వారు. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా విశేష సేవలు అందించారు. 4. పి. నారాయణన్ సాహిత్యం, విద్య కేరళకు చెందిన వారు. విద్యా రంగంతో పాటు సాహిత్య అభివృద్ధిలో విశేష కృషి చేశారు.
5 ఎన్. రాజం , కళలు , ఉత్తరప్రదేశ్ , శాస్త్రీయ సంగీతం (వయోలిన్) లో అసమాన కృషి చేశారు.
పద్మ భూషణ్ పురష్కారం లభించిన వారు వీరే..
*మమ్ముట్టి : కళలు, కేరళ (సినీ నటుడు) |
* అల్కా యాగ్నిక్ : కళలు , మహారాష్ట్ర (గాయని) |
* డాక్టర్ నోరి దత్తాత్రేయుడు , వైద్యం , అమెరికా – ఆంధ్రప్రదేశ్ (క్యాన్సర్ నిపుణుడు) |
* విజయ్ అమృత్‌రాజ్ : క్రీడలు , తమిళనాడు (టెన్నిస్ దిగ్గజం) |
* ఉదయ్ కోటక్ : వాణిజ్యం , మహారాష్ట్ర (బ్యాంకింగ్ రంగం) |
* పీయూష్ పాండే (మరణానంతరం) : కళలు, మహారాష్ట్ర (అడ్వర్టైజింగ్ రంగం) |
3. తెలుగు రాష్ట్రాల్లో పద్మశ్రీ పురష్కారాలు వీరికే..
* రోహిత్ శర్మ (క్రీడలు): భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, టి20 వరల్డ్ కప్ విజేతగా చేసిన కృషి.
* దీపికా రెడ్డి (కళలు – తెలంగాణ): కూచిపూడి నృత్య రంగంలో విశేష సేవలు.
* డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ (సైన్స్ – తెలంగాణ): సీసీఎంబీ శాస్త్రవేత్తగా జన్యుశాస్త్రంలో చేసిన పరిశోధనలు
* గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్ (కళలు – ఆంధ్రప్రదేశ్): సినీ రంగంలో విశేష కృషి
* గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (మరణానంతరం – ఆంధ్రప్రదేశ్): అన్నమాచార్య సంకీర్తనల ప్రచారానికి చేసిన సేవలు
* చంద్రమౌళి గడ్డమనుగు (సైన్స్ – తెలంగాణ): విజ్ఞాన శాస్త్ర రంగంలో పరిశోధనలు
* గుడూరు వెంకటరావు (వైద్యం – తెలంగాణ): గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో చేసిన సేవలు
అవార్డుల ప్రత్యేకత:
* క్రీడలు: రోహిత్ శర్మతో పాటు మహిళా క్రికెట్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, టెన్నిస్ స్టార్ రవిచంద్రన్ అశ్విన్ (క్రికెట్), పి.ఆర్. శ్రీజేష్ (హాకీ) లకు పద్మ పురస్కారాలు దక్కాయి.
* అన్సంగ్ హీరోస్: కర్ణాటకకు చెందిన అంకె గౌడ (ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత లైబ్రరీ స్థాపకుడు) వంటి 45 మంది సామాన్యులకు పద్మశ్రీ ప్రకటించారు.
* వైద్యం: మహారాష్ట్రకు చెందిన ఆర్మిడా ఫెర్నాండెజ్ (ఆసియాలోనే మొదటి హ్యూమన్ మిల్క్ బ్యాంక్ స్థాపించిన పీడియాట్రీషియన్) కు పద్మశ్రీ దక్కింది.
———————————–
