ఆకేరు న్యూస్, ములుగు: హైదరాబాద్ గాంధీభవన్ లో టిపిసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియామక పత్రాన్ని పైడాకుల అశోక్ అందుకున్నారు. ఈ సందర్భముగా అశోక్ మాట్లాడుతూ రెండవసారి తనను నమ్మి ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించిన ఏఐసీసీ అగ్ర నేతలకు, ముఖ్యమంత్రి , టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ , మంత్రి సీతక్క లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే కష్టపడిన ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తుందని, పనిని బట్టి పదవులు ఇస్తారని అన్నారు. నాకు మరొకసారి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, సీతక్క అడుగు జాడల్లో నడుస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం లక్ష్యంగా పని చేస్తా అని అన్నారు.ఆయన వెంట ములుగు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
……………………………………………………………………………
