
* పహల్గం దాడిలో చనిపోయిన వారి ఆత్మశాంతికై కొవ్వొత్తుల ర్యాలీ
* మతం పేరుతో హత్యలు చేయడం అమానుషం
* పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ దారుణాలకు
పాల్పడుతున్నారు
* బిజెపి మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్
ఆకేరు న్యూస్, కమలాపూర్ : పాకిస్తాన్ మతం పేరుతో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ హత్యలు చేస్తుందని బిజెపి మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ అన్నారు.హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం బిజెపి ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర దాడిలో చనిపోయిన హిందువులను స్మరిస్తూ కమలాపూర్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి భారీ సంఖ్యలో బిజెపి శ్రేణులు పాల్గొన్నారు.మతదురాగ్రహ ఉగ్రవాదులు ఐడీ కార్డులు అడిగి, హిందువులపై జరిపిన కాల్పుల్లో 28 మంది హత్యకు గురై, 20 మందికి గాయాలైన దారుణ ఘటనను ఖండిస్తూ బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్ చౌరస్తాలో ఈ ర్యాలీ చేపట్టారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ మాట్లాడుతూ… మతం పేరుతో జమ్ము కాశ్మీర్ లోని పహాల్గాం లో జరిగిన హత్యాకాండ ,సిగ్గుమాలిన చర్య అని అన్నారు. మతం పేరుతో ఈ విధంగా టెర్రరిస్టులు హిందూ మతం పైన దారునాలు చేయడం సిగ్గుచేటు అని,టెర్రరిస్టుల చర్యను ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయని అన్నారు. ప్రధాని మోడీ , అమిత్ షా తలుచుకుంటే పాకిస్తాన్ మాడి మాసవుతుందని అన్నారు. ఉగ్ర దాడిలో చనిపోయిన వారి ఆత్మ శాంతించేలా, దోషులను చట్టం ముందు నిలబెట్టి శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బండారి సుధాకర్, బిక్షపతి.ఎగ్గాజి శ్రీనివాస్,ఆకనపల్లిరవిందర్, తోట రాంప్రసాద్, మేడిపెల్లి రాజు,పసునూటి రానా ప్రతాప్ ,చిట్టి సుందరయ్యా,మోగిడె ప్రసాద్,పుస్కరి రాంబాబు,విలంద రాజు,కొండమది బిక్షపతి,మౌటం శ్రీనివాస్, చారి,బుర్ర కుమారస్వామి, సర్రం సురేష్, చెలక శ్రీనివాస్,కురిమిల్ల సంతోష్,ఆడెపు వినమ్తు,మ్మశోభన్ బాబు,శనిగరపు సంపత్, మొగిలి,శనిగరపు ఆనందం,సుసుకుల రత్నం, పుల్ల రమేష్ ,పుల్ల ఆదుభూతరావు, పంగిడిపెల్లి సాంబయ్య,కట్కుకూరి శంకర్అట్ల చంద్రశేఖర్, బండీ సురేష్, ప్రభాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
…………………………………….