ఆకేరున్యూస్, హైదరాబాద్: పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై దౌత్యపరమైన కఠిన చర్యలను అమలు చేయాలని నిర్ణయించింది. తాజాగా భారత్‌లో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతాను నిలిపివేసింది. జమ్ము కశ్మీర్‌పై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో పాక్ రక్షణ మంత్రి ఖవాజా అసీఫ్ ఎక్స్ ఖాతాను భారత్‌లో బ్లాక్ చేసింది. అంతకుముందు భారత్‌లో పాకిస్థాన్ ‘ఎక్స్’ ఖాతాను కేంద్రం నిలిపివేసిన విషయం తెలిసిందే. పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ అకౌంట్‌ను యాక్సెస్ చేయకుండా నిలిపివేయడంతో పాటు పలువురు పాకిస్థాన్ జర్నలిస్టులకు చెందిన ఎక్స్ ఖాతాలను కూడా నిషేధించినట్లు సమాచారం.
………………………………………………….
