
* రక్తం మరిగిపోతోంది : ప్రధానమంత్రి మోదీ
ఆకేరు న్యూస్, డెస్క్ : జమ్ముకశ్మీర్ తుత్మారి గలి, రాంపూర్ సెక్టార్ల వద్ద పాక్ సైనికులు కాల్పులు జరిపారు. పాక్ సైనికుల కాల్పులను భారత్ సైనికులు సమర్ధవంతంగా తిప్పికొట్టారు. శనివారం మధ్య రాత్రి నియంత్రణ రేఖ (LOC) వెంబడి పాకిస్తాన్ సైనికులు కాల్పులు జరిపినట్లు భారత ఆర్మీ తెలిపింది. సరిహద్దు వెంబడి టుట్మారి గాలి, రాంపూర్ సెక్టార్లకు ఎదురుగా ఉన్న ప్రాంతాలలో పాకిస్థాన్ దళాలు కాల్పులకు పాల్పడటంతో వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం కాల్పులకు తిప్పికొట్టింది. ఈ కాల్పుల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కాగా, పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్ మాకు సంబంధం లేదంటూనే భారీగా సైన్యాన్ని సరిహద్దుకు తరలిస్తోంది. కాగా, పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో రక్తం మరిగిపోతోందని, ఉగ్రవాద దాడి బాధ్యులు తగిన మూల్యం చెల్లించక తప్పదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. జమ్ముకశ్మీర్లో ప్రజాస్వామ్యం బలపడుతోందని చెప్పారు.
……………………………………….