
* రుణాలు ఇచ్చి ఆదుకోవాలని ట్వీట్
ఆకేరు న్యూస్, డెస్క్ : భారత్ కొనసాగిస్తున్న ఆపరేషన్ సిందూర్ తో పాక్ విలవిలలాడుతోంది. భారత్ దాడులతో తీవ్రంగా నష్టపోయామని, మాకు సహకారం అందించాలని పాక్ ట్వీట్చేసింది. అప్పు కోసం ప్రపంచాన్ని అర్థిస్తోంది. భారత్ తో పెట్టుకుని అన్ని విధాలుగానూ పాక్ నష్టపోయింది. దిక్కుతోచని స్థితిలో తీవ్రంగా నష్టపోయామని వాపోతోంది. యుద్ధం తీవ్రమవుతోందని, స్టాక్స్ కోల్పోయామని, నిల్వలు అయిపోయాయని పేర్కొంటూ పాక్ ట్వీట్ చేసింది. పాకిస్తాన్ కు మరిన్ని లోన్లు కావాలని , తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నామని, సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి పాక్ ఆర్థిక శాఖ కోరుతోంది. అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు తీసుకుని బలపడేందుకు ప్రయత్నిస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ నిధులు ఇవ్వొద్దని భారత్ కోరుతోంది. నిధులు ఇచ్చినా, వాటిని పౌరుల ప్రయోజనాల కోసం వినియోగించదని, ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు, భారత్ పై దాడులకు యత్నిస్తుందని పేర్కొంది.
………………………………………