
– ఊరికి అంబులెన్స్ రాలేక ప్రాణాలు పోతున్నాయంటూ
గ్రామస్తుల ఆవేదన
– రెండు మూడు రోజుల్లో పనులు ప్రారంభిస్తామన్న ఎంపీడీవో
హామీతో ఆందోళన విరమణ
ఆకేరు న్యూస్, కమలాపూర్ : కమలాపూర్ మండలం పంగిడిపల్లి గ్రామ ప్రధానరోడ్డు అద్వాన్నంగా మారి,108 అంబులెన్స్ పోలేక ప్రాణాలు పోతున్నాయంటూ గ్రామస్తులు సోమవారం కమలాపూర్ లోని అంబేద్కర్ కూడలి వద్ద ధర్నా చేశారు. కమలాపూర్ నుండి పంగిడిపల్లి కి వెళ్లే దారిలో హెచ్‌పిసిఎల్ గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్‌కు నిత్యం భారీ వాహనాల రాకపోకల వల్ల రోడ్డు అధ్వానంగా మారింది. చిన్న చినుకు కురిసినా ఆ గుంతల రోడ్డు చెరువునీ తలపిస్తుంది. ఇప్పటికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న అధికారులు రోడ్డు నిర్మాణాన్ని మొదలు పెట్టడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణం చేపట్టాలంటూ రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎంపీడీవో గుండె బాబు ,ఎమ్మార్వో సురేష్ , పోలీసులు ధర్నా చేస్తున్న స్థలానికి చేరుకొని ధర్నా చేస్తున్న వారితో మాట్లాడారు. రెండు మూడు రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభిస్తామని ఎంపీడీవో అక్కడే ఫోన్లో రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్ తో మాట్లాడి హామీ ఇవ్వడంతో హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
………………………………………