* అందుకే భారీ కుంభకోణానికి రేవంత్ కుట్ర
* మేఘా కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు
* బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈస్ట్ కంపెనీ(East India Company)గా రేవంత్ రెడ్డి పేర్కొన్న మేఘా(Mega) సంస్థకే భారీ ప్రాజెక్టులు కట్టబెడుతున్నారని, ఢిల్లీకి మూటలు పంపేందుకు ఇలా చేస్తున్నారని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Brs Working President Ktr) అన్నారు. 1100 కోట్ల కాళేశ్వరం పనులను 5500 కోట్లకు పెంచి, భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి(Revanthreddy), మేఘా కృష్ణారెడ్డి(Mega Krishnareddy), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. హైదరాబాద్(Hyderabad) తాగునీటి కోసం సుంకిశాల ప్రాజెక్టు చేపట్టామని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ మంత్రిగా ఉన్న రేవంత్ ఆ ప్రాజెక్టును పట్టించుకోలేదన్నారు.
మేఘా కంపెనీ క్రిమినల్ నెగ్లిజన్సీతోనే సుంకిశాలలో రీటైనింగ్ వాల్ కూలిపోయినట్టుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక ఇచ్చిందని, మేఘా సంస్థను బ్లాక్ లిస్టు(Black List)లో పెట్టాలని కూడా రికమండ్ చేసిందని గుర్తు చేశారు. ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు రేవంత్ రెడ్డి చెప్పినట్లు కాళేశ్వరం ప్రాజెక్టుపై సంతకం పెడితే తాము అధికారంలోకి వచ్చాక విచారణ జరిపించి, వాళ్ల ఉద్యోగాలను ఊడకొట్టడం ఖాయమని హెచ్చరించారు. ఎక్కడ బిడ్ లు చేస్తున్నారో ఆ సంస్థ పేరు కూడా మాకు తెలుసని చెప్పారు. ఆరు గ్యారంటీల అమలకే పైసలు లేవంటున్న రేవంత్, మూసీ ప్రాజెక్ట్ (Musi Project)కోసం మాత్రం ఆగమేఘాల మీద పనులు చేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. దాన్ని కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ అయిన మేఘా ఇవ్వటానికి అన్ని సిద్ధం చేసుకున్నారని మండిపడ్డారు. ఈ కుంభకోణాలను ముందే ప్రజలకు వివరిస్తున్నానని తెలిపారు.
………………………………………….