* కొత్తగా 10 బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం
ఆకేరు న్యూస్, డెస్క్ : డిసెంబర్ 1 నుంచి 19 వరకు 15 రోజులు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నారు. శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన ఆదివారం న్యూఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సభా సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్రం కోరింది. సభలో ప్రవేశపెట్టనున్న బిల్లులను ఆమోదించేందుకు మద్దతు ఇవ్వాలని వారికి విజ్ఞప్తి చేసింది. ఈ సమావేశాల్లో కొత్తగా మొత్తం 10 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మావోయిస్టులపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరి తదితర అంశాలను లక్ష్యంగా చేసుకుని అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ప్రణాళికలు చేపట్టాయి. ఈ సమావేశాల్లో అధికార పార్టీ అనుసరిస్తున్న విధానాలను ఎండగుడుతూ.. ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి.
………………………………………………………
