ఆకేరున్యూస్, హైదరాబాద్: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైలు నుంచి గురువారం రాత్రి విడుదల అయ్యారు. పట్నం నరేందర్ రెడ్డికి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కాగా, వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి చేశారన్న అభియోగాల కేసులో అరెస్టయి, జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో పాటు 24 మంది రైతులకు నాంపల్లి స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేయగా ఈ రోజు విడుదల అయ్యారు.
…………………………