ఆకేరున్యూస్ అమరావతి : తెలుగు ప్రేక్షకులకు పాకిజాగా గుర్తింపు తెచ్చుకున్న సినీ నటి వాసుకికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 2 లక్షల ఆర్థిక సాయం అందించారు.గత కొంత కాలంగా అనారోగ్యంగా ఉన్న ఆమె ఇటీవల సోషల్ మీడియాలో తన దీనస్థితిని తెలియజేస్తూ అనేక వీడియోలను పోస్టు చేసింది. ఈ వీడియోలన్నీ వైరల్ గా మారాయి సోషల్ మీడియా ద్వారా వాసుకి పరిస్థితి గురించి తెలుసుకున్న పవన్ కల్యాణ్ తక్షణమే స్పందించి ఆమెకు రెండు లక్షల రూపాయల నగదును అందజేశారు. ఏపీ ప్రభుత్వ విప్ హరిప్రసాద్ ద్వారా ఈ నగదు ఆమెకు అందజేశారు. తమిళనాడు వాస్తవ్యురాలైన వాసుకి పలు తెలుగు చిత్రాల్లో నటించింది. ఇటీవల ఆమెకు సినిమా అవకాశాలు తగ్గాయి వయసు మీద పడడంతో ఆమెఅనారోగ్యంతో బాధపడుతోంది. తమిళనాడులో తనను ఆదరించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఏపీ గవర్నమెంట్ తనకు నెలనెలా పెన్షన్ వచ్చే ఏర్పాటు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరుతోంది. తన పరిస్థితిని తెలుసుకొనిఆర్థిక సహాయం చేసిన పవన్ కు ఆమె కృతజ్ఞతలు చెప్పింది. పవన్ కల్యాణ్ కు జీవితాంతం రుణపడి ఉంటానంటోంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి,నాగబాబులు కూడా తనకు ఆర్థికసాయం అందించారని గుర్తుచేసుకుంది.అసెంబ్లీ రౌడిలో ఆమె ధరించిన పాకిజా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి నుండి తెలుగు ప్రేక్షకులు ఆమెను పాకీజా అనే పిలుస్తున్నారు.
………………………………………..
