
* బీఆర్ఎస్ నాయకులపై కక్షతోనే అక్రమ కేసులు
* ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్నా కొందరిపై ఎందుకు చర్యల్లేవ్
* ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
ఆకేరున్యూస్, హైదరాబాద్: బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడంలో ఉన్న శ్రద్ధ మరే విషయంలో ఎందుకు ఉండటం లేదని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ సోషల్‌మీడియా అకౌంట్ల మీద ఒక్క కేసు కూడా ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి కేవలం బీఆర్ఎస్ సోషల్‌మీడియా అకౌంట్లే కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మార్ఫింగ్ ఫొటోలను పోస్టు చేస్తున్నారని, కాంగ్రెస్ సోషల్‌మీడియా అకౌంట్ల నుంచి దారుణంగా ట్రోల్ చేస్తున్నారని తెలిపారు. రేవంత్ సైన్యం పేరిట కేటీఆర్‌పై దారుణమైన పోస్టులు పెడితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఎన్ని దారుణమైన పోస్టులు పెడుతున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని అడిగారు.
……………………………..