
* అపరిస్కృత సమస్యలు పరిష్కరించాలి
* మిషన్ భగీరథ కార్మికుల నిరసనలు
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం పాలంపేట, ఏటూర్ నాగారం మిషన్ భగీరథ కార్మికులు ఆయా మండల కేంద్రాలలో ప్లే కార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ కమిటీ ల నాయకులు పలువురు మాట్లాడుతూ ఈ పథకం కింద విధులు నిర్వర్తిస్తున్న ప్రతి ఉద్యోగికి ఉద్యోగ భద్రత ఈ ఎస్ ఐ, పి ఎఫ్ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న మూడు నెలల జీతాలు పెంచి ఇవ్వాలని ,ప్రతి నెల బిల్లులతో సంబంధం లేకుండా నెల నెల జీతాలు ఇవ్వాలని, కార్మికులు కోరారు. కార్మికుల అపరిస్కృత సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మంగపేట ,కమలాపురం,ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, వాజేడు తదితర మండలాల మిషన్ భగీరథ కార్మికులు సుమారు వంద మంది కర్ర పత్రాలతో నిరసన తెలిపారు.
…………………………………………….