
* వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
* ఓటు చోరీపై కాంగ్రెస్ సంతకాల సేకరణ
ఆకేరు న్యూస్ హనుమకొండ : కేంద్రంలో బీజేపీని ప్రజలు వద్దు అంటే ఎన్నికల సంఘం కావాలనుకుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓట్లను దొంగిలించి గెలిచిందని ఆరోపించారు. ఓటు చోరీపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమకొండ చౌరస్తాలో సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఓటు హక్కు కోల్పోవడం అంటే సర్వం కోల్పోవడం అన్నారు. బీజేపీ,బి ఆర్ ఎస్ పార్టీలు గతంలో ఓట్లను అపహరించాయని,శాసన సభ ఎన్నికల్లో,పార్లమెంట్ ఎన్నికల్లో వ్యత్యాసం ఉందని చెప్పారు.ప్రజలందరు మాకెందుకు అనుకుంటే బిజెపి ప్రభుత్వం ఈసీ తో కలిసి మన ఓట్లను చోరీ చేస్తున్నదని గుర్తు చేశారు.గడిచిన చాలా కాలంగా రాహుల్ గాంధీ గారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పాల్పడిన ఓట్ల చోరీపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారని అన్నారు.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేస్తూ,మతపరమైన రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ఓ వైపు దేశం ఆర్థిక సంక్షోభంలో ఉంటే బీజేపీ అధికార దాహంతో ఉందన్నారు. ,రాహుల్ గాంధీ చేస్తున్న ఓటు చోరీ పోరాటంపై కేంద్ర ప్రభుత్వం,ఈసీ సరైన సమాధానం చెప్పలేదు అని మండిపడ్డారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను మోసం చేస్తున్న బీజేపీ తీరును ప్రజలు ఖండిస్తున్నారని అన్నారు. ఓటు చోరీలు, ఈసీ పాక్షిక వైఖరికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ స్వరం కలిపి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరగాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను అణిచివేయాలని చూస్తోందన్నారు బీజేపీ చేస్తున్న ఓటు చోరీకి వ్యతిరేకంగా ఇంటింటికీ తిరిగి సంతకాలను సేకరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు ఎంపీ కడియం కావ్య కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
…………………………………………..