* ఫార్ములా – ఈ కార్ రేసింగ్‌పై చర్చకు రెడీ..
* రేవంత్ సర్కార్‌కు తేల్చిచెప్పిన కేటీఆర్
ఆకేరున్యూస్, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, ధైర్యం ఉంటే, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఫార్ములా – ఈ కార్ రేసులో కేసు నమోదుపై కేటీఆర్ శాసనసభా వేదికగా స్పందించారు. ఫార్ములా – ఈ కార్ రేసింగ్‌పై అసెంబ్లీలో చర్చకు పెడితే.. సమాధానం చెప్పేందుకు రెడీగా ఉన్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా మిమ్మల్ని, ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. ఫార్ములా – ఈ కార్ రేసింగ్‌పై ఏదో కుంభకోణం జరిగిందని అంటున్నారు కదా..? దాని మీద చర్చ పెట్టండి. మొత్తం సమాధానం చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ స్పష్టం చేశారు.
…………………………………….