
రైతుల అవమానం ఎలా తెలుస్తుంది
* కాంగ్రెస్ పాలనలో రైతులకు మళ్లీ కష్టాలు
* 52 సార్లు ఢిల్లీ పర్యటన చేసి ఏం తెచ్చిన్రు
* రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఫైర్
ఆకేరున్యూస్, నల్గొండ : కాంగ్రెస్ పాలనలో రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadeesh reddy) విమర్శించారు. యూరియా కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. నల్లగొండ(Nalgonda)లో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanthreddy)పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. మంది కాళ్లు మొక్కి పదవులు తెచ్చుకునేటోడికి, పైరవీలు చేసుకునేటోడికి రైతులు పడుతున్న అవమానం ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఓ మహిళా రైతు ఓ అధికారి కాళ్లు పట్టుకుని ఓ బస్తా యూరియా ఇప్పించాలని వేడుకోవడం ఎంత దౌర్భాగ్యం అని ఆవేదన వ్యక్తం చేశారు. అదీ డబ్బులకు కూడా యూరియా ఇవ్వలేకపోతున్నారని అన్నారు. ఈరోజు 200 రూపాయలకు దక్కాల్సిన యూరియా 400 పెట్టినా దక్కే పరిస్థితి లేకుండా చేశారన్నారు. దీనికి ప్రభుత్వ పెద్దలే బాధ్యులన్నారు. ఎందుకు రాదు యూరియా అని చాలా చాలా మాట్లాడారు కదా.. ఇప్పుడు ఆ మాటలు ఏమయ్యాయని రేవంత్ ను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండేళ్లు ముగియకముందే 52 సార్లు ఢిల్లీ పర్యటన (Delhi Tour) చేసి ఏం తెచ్చినవ్ అని అడిగారు. కనీసం యూరియా కూడా తేలేకపోయారన్నారు. పైగా రైతులపై లాఠీచార్జీలు, పోలీసుల కాళ్లు మొక్కులు ఎందుకీ పరిస్థితి వచ్చిందని ప్రశ్నించారు. ఓ మహిళా రైతు ఓ అధికారి కాళ్లు పట్టుకుని ఓ బస్తా యూరియా ఇప్పించాలని వేడుకోవడం ఏం దౌర్భాగ్యం అన్నారు.
……………………………………….