
* వరదనీటిని భూగర్భంలోకి పంపే ప్రణాళిక సిద్దం
ఆకేరున్యూస్, హైదరాబాద్ :భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అవుతున్న నేపధ్యంలో జీహెచ్ ఎంసీ అధికారులు కీలకనిర్ణయం తీసుకున్నారు. వర్షపు నీరుతో ముంపు ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమై జనసీవనం అస్తవ్యస్తం అవుతోంది. దీనికి తోడు నాలాలు డ్రైనేజీలు నిండి పోతున్నాయి. ఆ నీరు ఖాళీ కావడానికి వారం రోజులు పడుతుంది. వారం రోజుల్లోపు మరోసారి వాన పడితే ఇంతే సంగతులు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని జీహెచ్ ఎంసీ అధికారులు శాశ్వతంగా సమస్య పరిష్కారానికి నడుంబిగించారు.నగర రహదారుల కింద భారీ భూగర్భ నీటి సంపులను నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు..దీని వల్ల రోడ్లపై నీరు నిలువకుండా ఉంటుంది, భూగర్భ జలాలను పెంచడానికి కూడా దోహదపడుతుంది.ఈ భూగర్భ సంపుల నిర్మాణం వల్ల రెండు ప్రధాన ప్రయోజనాలు ఉంటాయి. మొదటిది రహదారులపై నీరు నిలిచిపోకుండా నేరుగా సంపుల్లోకి వెళ్లిపోతుంది. దీంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. రెండోది సంపుల్లో నిలిచిన నీరు ఇంకిపోయేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సంపులోని ఇంజెక్షన్ బోర్లు ద్వారా నీరు భూమిలోకి చేరి, భూగర్భ జలమట్టం పెరిగేందుకు సహాయపడుతుంది.ఒక్కో సంపు కనీసం 2.65 లక్షల లీటర్ల నుంచి 10.4 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేయటలదని అదికారులు చెప్తున్నారు. 15 నుంచి 20 అడుగుల లోతులో, అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి వివిధ విస్తీర్ణాల్లో వీటిని నిర్మిస్తున్నారు. సంపుల్లోని నీరు భూమిలోకి ఇంకడానికి 60 నుంచి 120 అడుగుల లోతైన ఇంజెక్షన్ బోర్లు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని సంపులకు ఆటోమేటిక్గా ఆన్ అయ్యే మోటార్లు ఉన్నాయి. సంపు నిండినప్పుడు మోటార్ ఆన్ అయి, నీటిని సమీపంలోని నాలాలు లేదా చెరువుల్లోకి పంప్ చేస్తుంది.
………………………………………………..